![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-8 లో సోమవారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇందులో భాగంగా ప్రేరణ మెగా చీఫ్ అయినందుకు మొదట నామినేషన్ తననే చెయ్యమని బిగ్ బాస్ చెప్తాడు. దాంతో గౌతమ్ ని నామినేట్ చేస్తుంది ప్రేరణ. అసలు నువ్వు ఏంటో నీ గేమ్ ఏంటో అస్సలు అర్ధం అవట్లేదని ప్రేరణ అంటుంది.
నా గేమ్ మీకు ఎందుకు అర్థం అవ్వాలంటూ గౌతమ్ మొదలెట్టాడు.. అవసరం ఏముంది.. మీరెప్పుడు ఒకరిని తక్కువ చేసేలా మాట్లాడుతారు.. సిగ్గులేదా అని మాటలు మీరు తీసుకుంటారేమో గాని నేను తీసుకోలేను.. మాటలు మర్యాదగా మాట్లాడాలి కంట్రోల్ లో ఉండాలని గౌతమ్ అంటాడు. ఒక మాటని గుచ్చి గుచ్చి మాట్లాడుతావు.. మీకు అసలు లీడర్ షిప్ క్వాలిటీస్ లేవు.. ఇంకా మెగా చీఫ్ క్వాలిటీస్ లేవు.. అంత గ్రూపిజమని గౌతమ్ అంటాడు. దాంతో ప్రేరణ కూడా తగ్గకుండా మాట్లాడుతుంది.
ఆ తర్వాత పృథ్వీని గౌతమ్ నామినేట్ చేస్తాడు. నువ్వు ఒకరికి ఇబ్బంది అవుతుందన్నా కూడా పట్టించుకోవు.. నీ వరకు వస్తే అది ప్రాబ్లమ్ లేదంటే లేదు.. నువ్వు హౌస్ లో చాలా మందికి డిస్ రెస్పెక్ట్ ఫుల్ గా మాట్లాడావ్.. అవినాష్, రోహిణిలని తక్కువ చేసి మాట్లాడావ్.. అది నాకు నచ్చలేదని గౌతమ్ అంటాడు. గౌతమ్ గురించి టాపిక్ వదిలేయ్.. ఎందుకు అంటే సీతాఫలం తింటున్నానని కెమెరాకి ముందే చెప్పాడు.. జనాల ఫన్నీవేలో చేసాడని.. చూస్తారు నువ్వే ఎక్కువ చేస్తుందనుకుంటారని ప్రేరణతో రోహిణి అసలేం జరిగిందో చెప్తుంది.
![]() |
![]() |